జహీరాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ఎం ట్యుటోరియల్ నిర్వాహకుడు సంఘమేశ్వర అతని మిత్రులు అనాథలు, వలస కూలీల ఆకలి తీర్చారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ.. మతిస్థిమితం లేని వ్యక్తులు, దూరప్రాంత బాటసారులకు పులిహోర పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక, ఆత్మాభిమానం చంపుకుని ఎవరిని అన్నం అడగలేక.. రైల్వేస్టేషన్, బస్టాండ్, భవాని మందిర్, పస్తాపూర్ కమాన్, మహీంద్రా కాలనీలో తలదాచుకుంటున్న వారికి ఆహార పొట్లాలు అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
ఆహార పొట్లాలు విప్పుకొని తినలేని వారికి స్వయంగా తినిపిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఐదుగురు స్నేహితులు పోగు చేసుకున్న డబ్బులతో.. రోజూ ఇరవై ఐదు కేజీల పులిహోర తయారు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. దాతలు ఎవరైనా బియ్యం నిత్యావసరాలు అందజేస్తే మరికొంత మందికి ఆకలి తీర్చేందుకు సిద్ధమని యువకులు ప్రకటిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆ అలవాటును మార్చుకోవాలంటే ఏం చేయాలి?