సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. వరదసాయం పేరుతో చాలా మందిని దోచుకున్నారని బీజేవైఎం నాయకులు ఆశిశ్గౌడ్ ఆరోపించారు.
అసలైన బాధితులకు నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గ్రేటర్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమని ఆదుకోవాలని... లేనిపక్షంలో గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందే వండుకుని తింటామని... ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.