సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆల్విన్ కాలనికి చెందిన రాంబాబు గత రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. రాత్రి నిద్ర పోనివ్వకుండా కొడుకు పవన్ కుమార్ను ఇబ్బందికి గురి చేశాడు. మధ్యాహ్నం చరవాణిలో వీడియో గేమ్ ఆడుకుంటున్న కొడుకుపై వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోవడం వల్లనే ఇలా చేశాడని కుమారుడు చెబుతున్నాడు.
ఇదీ చూడండి : 'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'