ETV Bharat / state

నిమ్జ్​ కోసం భూసేకరణ ఆపాలని రైతుల ధర్నా - nimz farmers protest

జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి కోసం చేపడుతున్న భూసేకరణ ఆపాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం మార్కెట్​ ధరకు భూములు కొనుగోలు చేసి పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు.

farmers protest in sangareddy district
నిమ్జ్​ కోసం భూసేకరణ ఆపాలని రైతుల ధర్నా
author img

By

Published : Jun 11, 2020, 7:02 PM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​‌ మండలంలో నిమ్జ్‌ భూ బాధిత రైతులు ధర్నా చేపట్టారు. మండలంలో ఏర్పాటు చేయనున్న జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి కోసం రెండో విడత చేపడుతున్న భూసేకరణ ఆపాలని రైతులు గ్రామ పంచాయతీల ఎదుట ధర్నా చేశారు.

మామిడ్గి, గంగ్వార్‌, న్యామతాబాద్‌ గ్రామాలు సహా మండలంలోని 20 పంచాయతీల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగించినట్లు భూ బాధిత కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం పంటలు పండే భూములు లాగేసుకోకుండా మార్కెట్‌ ధరకు భూములు కొనుగోలు చేసి పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టుకు నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.