రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. హత్నూర మండలంలోని కాసాల, చింతల్‌చెరు గ్రామాల్లో నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడవద్దని సూచించారు.
తరచు పర్యవేక్షణ చేయాలి..
మండల స్థాయి అధికారులు తరచూ వచ్చి పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో పనులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎక్కడివారు అక్కడకే..
మండల పరిధిలోని అన్నదాతలు ఎక్కడివారు అక్కడే స్థానికంగా రైతు కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అధికారులే అక్కడికి వచ్చి ఏ సమయంలో పంటలకు తెగుళ్లు వస్తాయో, తదితర వివరాలు తెలియపరుస్తారని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు