ETV Bharat / state

బీడీఎల్​ పరిశ్రమలో మిస్​ ఫైర్​ అయిన పేలుడు పదార్థం

బీడీఎల్​ పరిశ్రమలో ఆయుధ సామగ్రి పరీక్షలు నిర్వహిస్తుండగా ఓ పేలుడు పదార్థం మిస్​ పైర్​ అయ్యి బయటపడింది. శివారులోని వ్యవసాయ పొలాల్లో పడటంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు భయాందోళనలకు గురయ్యారు.

explosive weapons misfired in bdl industry
బీడీఎల్​ పరిశ్రమలో మిస్​ ఫైర్​ అయిన పేలుడు పదార్థం
author img

By

Published : Nov 26, 2020, 6:54 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానురు గ్రామ పరిధిలో ఉన్న బీడీఎల్ పరిశ్రమలో ఓ పేలుడు పదార్థం బయటపడింది. పరిశ్రమలో ఆయుధ సామగ్రి పరీక్షలు నిర్వహిస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఈ ఘటన జరిగింది.

పేలుడు పదార్థం శివారులోని వ్యవసాయ పొలాల్లో పడింది. పొల్లాల్లో పనిచేస్తున్న రైతులపై నుంచి కొద్ది ఎత్తు దూసుకెళ్లడంతో వారంతా భయాందోళనలకి గురయ్యారు. పేలుడు పదార్థాన్ని వెతికేందుకు సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు చాలాసేపు శ్రమించారు. కానీ ఈ ఘటనను బీడీఎల్​ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణించలేదు.

ఇదీ చదవండి: ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ... కొవాగ్జిన్​ పురోగతి పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.