సంగారెడ్డి జిల్లాలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటుతున్నట్లు అబ్కారీ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామ పరిధిలో కల్లుగీత సహకార సంఘానికి సంబంధించిన ఈతవనంలో వంద ఈత మొక్కలను కల్లుగీత సంఘం ఆధ్వర్యంలో అబ్కారీ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి నాటారు.
నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీన్ని బాధ్యతగా తీసుకోవాలని... అప్పుడే ఈతవనం అనుకున్న విధంగా తయారవుతుందని కేఏబీ శాస్త్రి అన్నారు. మెుక్కల సంరక్షణ కోసం అధికారులు, సంఘం నాయకులు కూడా కృషి చేయాలని ఆయన చెప్పారు.
ఇవీ చూడండి: జిల్లాలో కోటి మొక్కలు నాటాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్