వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చని అమీన్‌పూర్ ఎంవీఐ రజా మహమ్మద్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పటేల్‌గూడ ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాలలో రవాణా, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులు, డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై జాతీయ రహదారిపై ఎక్కువమంది ప్రమాదాల మూలంగానే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని ట్రాఫిక్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. శిరస్త్రాణం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి నివారించే విధంగా ప్రయత్నించాలని సూచించారు.
ఇవీ చూడండి : లైవ్ వీడియో: అందరూ చూస్తుండగానే... కత్తులతో పొడుచుకున్నారు