ETV Bharat / state

Eruvaka: రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక వేడుకలు..

రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక వేడుకల్ని సంబురంగా నిర్వహించారు. జేష్ఠ్య పౌర్ణమి రోజున ఎడ్ల బండ్లను అందంగా అలంకరించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఉత్సాహంగా నాగలిపట్టి దుక్కి దున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.

eruvaka
ఏరువాక
author img

By

Published : Jun 25, 2021, 4:22 AM IST

రాష్ట్రంలో ఏరువాక వేడుక ఘనంగా నిర్వహించారు. తొలకరి జల్లులు కురవటంతో.... వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఎడ్లను శుభ్రంగా కడిగి.... కొమ్ములకు రంగులు వేశారు. గజ్జెలు, పట్టీలతో అందంగా అలంకరించి పూజలు చేశారు. ప్రత్యేకంగా చేసిన పిండి వంటలు వాటికి తినిపించారు. అనంతరం ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా వెళ్లారు. సామూహికంగా పొలంలో దుక్కి దున్నారు.

వేడుకల్లో మంత్రి

సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురంలో రైతుమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక రైతులతో కలిసి అరక కట్టి కాడెడ్లతో దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. పంటలు సమృద్ధిగా పండి అన్నదాతలకు మేలు చేకూరాలని మంత్రి ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయన్న జగదీశ్‌ రెడ్డి..... తెరాస పాలనలో సాగుకు చేయూత లభించిందని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం, ఉచిత విద్యుత్‌, రైతుబంధు వంటి పథకాలు అన్నదాతలకు అండగా నిలిచాయని వ్యాఖ్యానించారు.

తగ్గిన సందడి

గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి సందడి తగ్గింది. వ్యవసాయ యాంత్రీకరణతో.... ట్రాక్టర్లు వచ్చాక ఎడ్లతో పొలం దున్నే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే... ఏరువాక ఆచారం అగిపోవద్దన్న ఉద్దేశంతో కొన్ని గ్రామాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు కనీసం 50 ఎడ్ల బండ్లు ఊరేగింపులో పాల్గొనగా... ఏటికేడు వాటి సంఖ్య తగ్గిపోతుంది.

ఇదీ చదవండి: CBSE: సోషల్​ మీడియా వేదికగా విద్యార్థులతో పోఖ్రియాల్ మాటామంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.