సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయకుడిని షవర్ల సాయంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించే జరుపుకోవాలని స్థానికులు కోరారు. భక్తులు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా.. సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించమని గణపతిని ప్రార్థించారు.
ఇదీ చూడండి: హిందీ రగడ: షా వర్సెస్ ప్రాంతీయ పార్టీలు