సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిల్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల కోసం గ్రేటర్ యంత్రాంగం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి 18 వరకు మూడు డివిజన్ల పరిధిలోని 15 కేంద్రాల్లో లబ్ధిదారుల నుంచి రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించారు. ఏడు రోజులపాటు నిర్వహించిన ఈ కేంద్రాల్లో 17, 096 మంది లబ్ధిదారులు రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారని గ్రేటర్ అధికారులు తెలిపారు. వీటినన్నింటిని పటాన్చెరు సర్కిల్ కార్యాలయంలో భద్రపరచాలని ఆయన చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అసలైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారనేది విచారణలో తెలుసుకుంటామని ఉపకమిషనర్ బాలయ్య తెలిపారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు - greater hyderabad
గ్రేటర్ హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిల్ పరిధిలో 7 రోజుల పాటు రెండు పడక గదుల ఇళ్ల కోసం 17096 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని ఉపకమిషనర్ బాలయ్య తెలిపారు.