పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో రూ.3 కోట్ల 30 లక్షలతో నిర్వహించే అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ప్రజల సమస్యలు, కావాల్సిన వసతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వాటిని సమకూర్చే దిశగా ప్రణాళికలు వేసి రహదారులు, భూగర్భ మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. పటాన్చెరును అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: అభివృద్ధి కోసం అప్పులు.. వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు