ETV Bharat / sports

ఆసీస్​ గడ్డపై గర్జించిన టాప్​ 5 భారత టెస్ట్​ కెప్టెన్లు వీరే! - విజయ శాతం ఎంతంటే? - INDIAN CAPTAINS WIN PERCENTAGE

ఆస్ట్రేలియా గడ్డపై ప్రత్యర్థి జట్టును ఎక్కువ సార్లు ఓడించిన టాప్​ 5 టీమ్​ఇండియా టెస్ట్​ కెప్టెన్లు ఎవరో తెలుసా?

Ajinkya Rahaney Kohli
Ajinkya Rahaney Kohli (Source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 12, 2024, 9:07 PM IST

ఆస్ట్రేలియా - భారత్ మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోసం రెండు జట్లు సన్నాహాలు మొదలు పెట్టాయి. 2024 నవంబర్ 22న పెర్త్‌లో తొలి టెస్టు మొదలవుతుంది. ఆసీస్‌ గడ్డపై టీమ్‌ ఇండియా తొలిసారి రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టెస్ట్‌ సిరీస్‌ ఆడబోతోంది. ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాలో రోహిత్‌ జట్టును ఎలా నడపిస్తాడు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువ టెస్టు విజయాలు అందుకున్న భారత్‌ కెప్టెన్ల గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. మరి ఆస్ట్రేలియాలో అద్భుతమైన సక్సెస్‌ రేటు ఉన్న కెప్టెన్లు ఎవరు? వారిని రోహిత్‌ శర్మ అధిగమించే అవకాశం ఉందా? ఇప్పుడు చూద్దాం.

అజింక్య రహానే - ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా ఎక్కువ టెస్టు విజయాలు అజింక్య రహానే అందుకున్నాడు. అతడు నాలుగు టెస్టులకే కెప్టెన్‌గా వ్యవహరించినా, విజయాల శాతం 66.67గా ఉంది. అతడి కెప్టెన్సీలో భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకోగా, మూడు విజయాలు అందుకుంది. 2020-21 సిరీస్‌లో రహానే కెప్టెన్సీలో భారత్‌ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకుంది.

బిషన్ సింగ్ బేడీ - స్పిన్ బౌలర్‌గా పాపులర్‌ అయిన బిషన్ సింగ్ బేడీ ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులకు భారత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ రెండు గెలవగా, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. బిషన్ సింగ్ బేడీ సక్సెస్‌ రేటు 40 శాతంగా ఉంది.

సునీల్ గావస్కర్‌ - లెజెండరీ ప్లేయర్‌ సునీల్ గావస్కర్‌ ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఇందులో ఒక విజయం, ఒక డ్రా, ఒక ఓటమి ఉన్నాయి. కెప్టెన్‌గా అతడి సక్సెస్‌ రేటు 33.33 శాతంగా ఉంది.

విరాట్ కోహ్లీ - ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఢీ అంటే ఢీ అనే రీతిలో కొనసాగింది. అయితే దురదృష్టవశాత్తు కెప్టెన్‌గా విజయాల శాతం 28.57గానే ఉంది. కోహ్లీ ఆస్ట్రేలియాలో మొత్తం 7 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో రెండు విజయాలు, మూడు డ్రాలు, రెండు ఓటములు ఉన్నాయి.

సౌరవ్ గంగూలీ - అగ్రెస్సివ్‌ కెప్టెన్సీకి మారుపేరైన సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఇందులో ఒక టెస్టులో విజయం సాధించగా, రెండు డ్రాగా ముగిశాయి. ఓ టెస్టులో పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా గంగూలీ సక్సెస్‌ రేటు 25 శాతంగా ఉంది.

సీక్రెట్‌ క్యాంప్‌లో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ - తొలి టెస్టు పిచ్ ఇదే!

పాకిస్థాన్ ప్లేయర్లకు మరో సమస్య - గట్టి షాకిచ్చిన భారత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.