ETV Bharat / state

కారును ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురికి తీవ్రగాయాలు

author img

By

Published : Feb 23, 2020, 11:27 PM IST

సుల్తాన్పూర్​ వద్ద బాహ్యవలయ రహదారిపై కారును డీసీఎం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమవగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

DCM HITS CAR FROM BACK SIDE NEAR SULTANPUR OUTER RING ROAD
కారును ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురికి తీవ్రగాయాలు

సుల్తాన్పూర్​ వద్ద బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్​ సాయికాలనీకి చెందిన విజయేందర్​ దంపతులు యాదాద్రి నారసింహుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సుల్తాన్పూర్​ బాహ్యవలయ రహదారిపై వారి కారును వెనుక నుంచి వచ్చిన డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​ భూపతిరెడ్డి, విజయేందర్​, ప్రవళ్లిక తీవ్రంగా గాయపడ్డారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి: కోడి కోసం కొడుకును చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.