రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. ఇవాళ రామగుండం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రాగా, ఇదే రోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది.
అతని తల్లి, తమ్ముడు, డ్రైవర్, పీఏకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మంత్రులకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు