సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో 12 మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా మిగిలిన సిబ్బంది, ఆసుపత్రిలోని రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పటాన్‌చెరులోని టంగుటూరి అంజయ్య స్మారక ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 12 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యులు తెలిపారు.
బాధితుల్లో ఒప్పంద కార్మికులు, ఆసుపత్రిలో రోగులకు ఆహారాన్ని వండి, వడ్డించే వారు ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
ఇదీచూడండి: లాక్డౌన్ ఎఫెక్ట్: ఆలుమగల మధ్య కరోనా రగిల్చిన మంటలివి!