సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయ ఈఓకు కరోనా సోకింది. గత మూడు, నాలుగు రోజులుగా ఈఓ మోహన్ రెడ్డికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయన పరీక్షలు చేయించుకున్నారు.
ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈఓకు కరోనా సోకడం వల్ల కేతకి ఆలయాన్ని రసాయనాలతో శుభ్రం చేశారు. ఈఓతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
ఇదీ చూడండి : '45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి'