ETV Bharat / state

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు - corona isolation ward in sangareddy

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ముందస్తుగా ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. ఈ వార్డును జడ్పీ ఛైర్​పర్సన్​ మంజూశ్రీ జైపాల్​రెడ్డి పరిశీలించారు.

corona isolation ward in sangareddy district
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు
author img

By

Published : Mar 20, 2020, 1:49 PM IST

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తుగా ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశారు. 10 పడకలున్న వార్డును 30 పడకలకు పొడfగిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్​ తెలిపారు.

ఈ వార్డును జడ్పీ ఛైర్​పర్సన్​ మంజూశ్రీ జైపాల్​రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై సూపరింటెండెంట్​ను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైరస్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

వ్యక్తిగత శుభ్రత పాటించి, అప్రమత్తంగా ఉంటే వైరస్​ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని, మున్ముందు నమోదైనా చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.