సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం లక్ష్మీనగర్ కాలనీలో వేకువజామున పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో... డీఎస్పీతో పాటు 120 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, 10ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున తనిఖీలు చేసినప్పటికీ ప్రజలు సహరించారని సంతృప్తి వ్యక్తం చేశారు. యజమానులు ఆధారాలు చూపించి తమ వాహనాలు తీసుకెళ్లొచ్చని సూచించారు.
ఇవీ చూడండి: సూర్యాపేటలో ముగిసిన నామినేషన్ల ఘట్టం