సంగారెడ్డిలోని మంజీర డ్యామ్ సందర్శనకు బయల్దేరిన డీసీసీ అధ్యక్షులు నిర్మలా జయప్రకాశ్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. సంగారెడ్డి నియోజక వర్గ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని నిర్మల అన్నారు. ప్రభుత్వం సంగారెడ్డి ప్రజలను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు.
డబ్బులు ఇచ్చి నీరు కొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజక వర్గం రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. అడగగానే నీరు ఇస్తే ఈ అరెస్టులు, సందర్శనలు వెళ్లడాలు ఉండవని పేర్కొన్నారు. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా మంజీర నీటిని ఇచ్చేవరకు తాము పోరాటాన్ని అపేదిలేదని ఆమె వెల్లడించారు.
ఇవీచూడండి: చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్‌తో ఒప్పందం