కరోనా వైరస్ రాకముందే తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రైతుబంధు అడపా దడపా జారీ చేశారు కానీ రైతులకు డబ్బులు అందిన దాఖలాలు కనిపించలేదని వ్యాఖ్యానించారు.
''పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత ప్రభుత్వానిదే. కరోనా కష్టకాలంలో బియ్యంతోపాటు నిత్యవసర వస్తువులు కూడా అందించాలి. కరోనాకి ఇప్పట్లో మందు వచ్చే అవకాశం లేదు కాబట్టి... ఇటువంటి సమయంలో సర్కారు బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మంచి వైద్యం, పౌష్టికాహారం అందించాలి. తక్షణమే కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా డిమాండ్.''
-ఎమ్మెల్యే జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కాళేశ్వరం కాదని... కరోనాకి వైద్యమన్నారు. ప్రైవేటు హాస్పిటల్‌లో కూడా ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయాలన్నారు.
ఇవీ చూడండి: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం