ETV Bharat / state

'వీళ్లు మద్యం, డబ్బులు పంచుతారు... వాళ్లు భద్రతనిస్తారు' - congress mla jagga reddy fire on kcr and ktr

తెరాస ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్​ సినీయర్​ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో తెరాస డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుంటే... పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెరాసకు అమ్ముడు పోయారన్నారు.

congress-mla-jagga-reddy-fire-on-kcr-and-ktr
'వీళ్లు మద్యం, డబ్బులు పంచుతారు... వాళ్లు భద్రతనిస్తారు'
author img

By

Published : Jan 2, 2020, 3:26 PM IST

తెరాస ఎన్నికల్లో డబ్బులు మద్యం పంపిణీ చేస్తుంటే పోలీసులు భద్రత కల్పిస్తున్నారని కాంగ్రెస్​ సినీయర్​ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెడుతూ... బలహీనపరిచే ప్రయత్నం తెరాస ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు.

ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెరాసకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఐఏఎస్​ అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని తెరాస సర్కారు ప్రతిపక్షాలను ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు అందుకే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి మంచినీటి ఇబ్బందులకు మంత్రి హరీష్‌రావు కారణమన్నారు. రాహుల్‌గాంధీపై మంత్రి దయాకర్ రావు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. దయాకర్ రావు తెదేపాలో ఉండగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టని తిట్లు తిట్టిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. మంత్రి పదవి శాశ్వతం కాదని ఎర్రబెల్లి గుర్తుంచుకోవాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.