ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట టిక్కెట్ల పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచి ప్రజల నడ్డి విరిచారని.. దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచలేదని.. ఇదే ప్రథమమని స్పష్టం చేశారు. టికెట్ల ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు అమలు.. ఛార్జీలు ఇవే!