ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్​ - rythu vedika in sangareddy

రైతు వేదిక భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. చింతల్‌చెరు గ్రామంలో రైతువేదిక నిర్మాణ పనులు పరిశీలించారు.

collector visit rythu vedika bhavan constructions works in chintalcheru sangareddy district
రైతు వేదిక నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్​
author img

By

Published : Sep 6, 2020, 10:28 AM IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చింతల్‌చెరు గ్రామంలో రైతువేదిక భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు నాటికి వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు, గుత్తేదారుకు సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లోపించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వేదికలు త్వరగా వినియోగంలోకి వస్తే రైతులు సమావేశాలు, సభలు నిర్వహించుకోవడం, పంట సాగుపై విస్తృతంగా చర్చింకుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జయరాంనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సమగ్ర భూ సర్వే.. వివాదాల్లేని రాష్ట్రమే సర్కార్ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.