సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. డంపింగ్ యార్డు నిర్మాణం పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యత ప్రమాణాలు ఉండాలన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం దగ్గరుండి పనులను పూర్తి చేసే విధంగా చూడాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం