గ్రామాల్లో రైతువేదికలను నిర్ణీత గడువులోపు నిర్మించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, జిన్నారం మండలాల పరిధిలో గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాలను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అలాగే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడా రాజీపడకూడదని సూచించారు.
పనుల్లో జాప్యం సహించబోమని గుత్తేదారులకు స్పష్టం చేశారు. అలాగే జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో తడి, పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉట్ల గ్రామం అన్ని విధాల ఆదర్శంగా ఉండి అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తోందని అభినందించారు.