సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతిర్త్ గ్రామంలో విఠల్ అనే రైతు పెద్దమనసుతో రైతు వేదిక నిర్మాణం కోసం అర ఎకరం స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు విఠల్‌ను సన్మానించారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రైతుతో ఫోన్లో మాట్లాడి అతన్ని అభినందించారు. ఆయనలాంటి రైతులను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన విలువైన స్థలాన్ని తోటి రైతుల ఉపయోగం కోసం ఇవ్వడం ఆదర్శనీయమన్నారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్