సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్‌లో 14 సహకార సంఘాల్లో తెరాస, కాంగ్రెస్ మద్దతుదారులు పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల గడువు ముగుస్తున్నందున ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు.
జహీరాబాద్ మల్మర్చ సహకార సంఘానికి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి తెరాస తరపు నామినేషన్ సమర్పించారు. అధికారులు అభ్యర్థుల నుంచి నో డ్యూ ధ్రువపత్రంతో పాటు ఓటర్ జాబితాను పరిశీలించి.. నామపత్రాలను స్వీకరించారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!