మున్సిపల్ కార్మికుల కాళ్లు కడగాలి అనటం కాదు... వారి కడుపు నింపండి చాలు అని సీఐటీయూ నాయకులు డిమాండు చేశారు. సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికులతో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్ని ధర్నాలు నిర్వహించినా.. ప్రభుత్వం కార్మికులపై దయ చూపటం లేదన్నారు. కరోనా కష్టకాలంలో మున్సిపల్ కార్మికుల సేవ ఎనలేనిదని కొనియాడారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 24, 000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు తీరే వరకు సీఐటీయూ వారి వెన్నంటే ఉంటుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున నిరస కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
'కాళ్లు కడగటం కాదు... కడుపు నింపండి చాలు' - Citu protest at sangareddy
సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికులతో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ.. ఆందోళన చేపట్టారు.
!['కాళ్లు కడగటం కాదు... కడుపు నింపండి చాలు' Citu protest at sangareddy collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8125418-536-8125418-1595416273328.jpg?imwidth=3840)