ETV Bharat / state

దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు.. - theft

ఓ సెల్ దుకాణంలో షాపు నిర్వాహకులకు కళ్లు కప్పి ఓ దొంగ చరవాణి దొంగిలించిన ఘటన పటాన్​చెరు ఠాణా పరిధిలో జరిగింది. చోరీ చేస్తున్న ఘటన అంతా సీసీ పుటేజీ నిక్షిప్తమైంది. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించినా ఆ దొంగ యథేచ్ఛగా ఒక్క క్షణంలోనే  బయటకు వచ్చాడు.

దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు..
author img

By

Published : Jun 7, 2019, 10:05 AM IST

దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు..

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఓంసాయి మొబైల్ దుకాణంలో చరవాణి చోరీ చేశాడు ఓ ప్రబుద్ధుడు. దుకాణదారు వేరే వ్యక్తులకు చరవాణిని చూపిస్తున్న సమయంలో ఇదే అదునైన సమయంగా భావించి డిస్​ప్లే ప్లాట్​ఫాంపై ఉన్న చరవాణిని మెల్లిగా జేబులో వేసుకుని ఉడాయించాడు. ఇదంతా సీసీ పుటేజీల్లో నిక్షిప్తం అయింది. దొంగిలించిన వ్యక్తిని గురువారం పట్టుకుని పటాన్​చెరు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్​లో అప్పగించిన కాసేపటికే దొంగ బయటకు రావడం... బాధితుని చరవాణి అతనికి ఇవ్వకపోవడం అనుమానం కలిగిస్తోంది. దొంగ చరవాణి తీసుకుని ఉడాయిస్తున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో రికార్డు కావడం వైరల్​గా మారింది.

ఇవీ చూడండి:ఇవాళ్టి నుంచి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.