ETV Bharat / state

పత్తి మిల్లును సందర్శించిన అధికారులు - ప్రమాదం వాటిల్లిన పత్తి మిల్లును సందర్శించిన అధికారులు

సంగారెడ్డి జిల్లాలోని అంత్వార్​ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించిన పత్తి మిల్లును సీసీఐ అధికారులు, ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది... ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంశాలపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు.

cci deputy manager and mla bhupalreddy visited cotton mill
ప్రమాదం వాటిల్లిన పత్తి మిల్లును సందర్శించిన అధికారులు
author img

By

Published : Jun 5, 2020, 6:01 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అంత్వార్ శివారులో అగ్నిప్రమాదం జరిగిన పత్తి మిల్లును సీసీఐ డిప్యూటీ మేనేజర్ జైకుమార్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సందర్శించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని జైకుమార్ పేర్కొన్నారు.

పూర్తి విచారణ అనంతరం ఎంత నష్టం వాటిల్లిందని తెలుస్తుందన్నారు. పత్తి మిల్లులో ప్రమాదం జరగడం దురదృష్టమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు వందల క్వింటాళ్ల వరకు పత్తి కాలి పోయి ఉంటుందని ఎమ్మెల్యే అంచనా వేశారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.