తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా రాష్ట్ర తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 17న విమోచన దినాన్ని పటాన్‌చెరులో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారని శ్రీవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అమరవీరులను తెరాస ప్రభుత్వం మర్చిపోయిందని తన త్యాగాలతోనే తెలంగాణ వచ్చినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి :'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'