ETV Bharat / state

BANDI SANJAY: 'వచ్చే ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయడం ఖాయం' - బండి సంజయ్ తాజా వార్తలు

తెరాసను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భాజపానేనని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలే సక్రమంగా ఇచ్చే పరిస్థితులు లేవని, దళితులకు దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఎలా ఇవ్వగలరో చెప్పాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సోమవారంతో 115 కిలోమీటర్ల దూరం పూర్తిచేసుకుందని సంజయ్‌ వివరించారు.

BANDI SANJAY
BANDI SANJAY
author img

By

Published : Sep 7, 2021, 5:14 AM IST

Updated : Sep 7, 2021, 6:18 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. జిల్లా పొలిమేరలో పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో, బోనాలతో, బతుకమ్మలతో, నృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను గద్దె దించి భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. కోట్లు వచ్చే భూములను కంపెనీలకు అప్పగించి ఉద్యోగాలు వస్తాయని తెరాస నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 95 శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలు చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. 2023లో భాజపా జెండా ఎగురవేసి చార్మినార్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

దుబ్బాకలో కేసీఆర్ మెడలు వంచామని.. వచ్చే హుజురాబాద్ ఎన్నికల్లో తెరాసను తుంగలో తొక్కడం ఖాయమని అన్నారు బండి సంజయ్. ఎండను, వానని లెక్క చేయకుండా 10వ రోజు యాత్ర చేస్తున్నాం అంటే ప్రజల ఆశీస్సులు తమకు ఏవిధంగా ఉన్నాయో గ్రహించాలని అన్నారు. డబుల్ బెడ్​రూం ఇల్లు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగులు లేకుండా చేస్తానన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని మండిపడ్డారు.

వచ్చే దారిలో చెరుకు రైతులు కలిసి వారి బాధలు చెప్పుకున్నారు, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా లేకపోవడం బాధాకరం. పంటలు ఏవి వేయాలో చెప్పి రైతులను పెదలుగా మార్చారు. ఇంత కష్టపడుతున్న రైతులు బికారులుగా మారుతున్నారు.. మరి నువ్వు ఏమి చేస్తున్నవని ధనికుడుగా మారుతున్నావ్?. కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇంత దగ్గరలో ఉన్న నీటిని సదాశివపేట పట్టణ వాసులకు అందించడం పోయి కంపెనీలకు తొత్తులుగా మారి వారికి తరలించడం ఏంటి?. గడిల పాలనను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీ.. రాష్ట్ర అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే భయపడే వాళ్లం కాదు. నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని పార్టీ బీజేపీ. అక్టోబర్ 2 వరకు ఈ యాత్ర కొనసాగిస్తాం. ప్రజల పట్ల కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడి 2023లో గద్దె దించుతాం. స్థానిక అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశారు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

ఇవీ చూడండి: BANDI SANJAY: వంద కి.మీ. పూర్తయిన ప్రజాసంగ్రామ యాత్ర

Last Updated : Sep 7, 2021, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.