వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుర్దిపహాడ్ గ్రామంలో నియంత్రిత వ్యవసాయ సాగుపై అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్తో కలిసి పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటను కాకుండా ఆదాయం ఇచ్చే ఇతర పంటలు సాగు చేసి ప్రభుత్వ విధానానికి సహకరించాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. వానకాలం అవసరాలకనుగుణంగా రైతులకు అన్ని ఎరువులను అందుబాటులో ఉంచుతామని డీసీఎంఎస్ ఛైర్మన్ మల్కాపురం శివకుమార్ సూచించారు. సదస్సులో భాగంగా పలువురు రైతులకు ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం అద్వితీయం... కొండపోచమ్మకు గోదావరి పరుగులు