తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆన్లైన్ సర్వే వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. స్మార్ట్ ఫోన్ నుంచి సర్వే చేయాలంటే వాటికి ఖర్చు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా కలక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు నెలల జీతం స్మార్ట్ ఫోన్‌కే పెడితే జీవితాలు ముందుకు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. మొబైల్ ఇచ్చినా దాన్ని ఎలా వాడాలో తెలియదన్నారు.
తొలగిస్తామని..
అధిక విధులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేతనం ఇవ్వకుండా అధిక బాధ్యతలు అప్పజెప్పడం న్యాయమా? అని ప్రశ్నించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ లెక్కలు అసత్యం: కోదండరాం