ETV Bharat / state

'ఆశ్రమ నిర్వాహకుల సహకారంతోనే బాలికపై అత్యాచారం' - అమీన్పూర్ అత్యాచార కేసు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని అనాథాశ్రమంలో లైగింక దాడికి గురైన బాలిక... చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మానాన్న లేకున్నా... ప్రయోజకురాలిని కావాలనే ఆశయంతో అనాథాశ్రమంలో చేరిన ఆ చిన్నారిని దాత రూపంలో చిదిమేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు... దర్యాప్తు వేగవంతం చేశారు.

Amninpur rape case DSP Rajeswar rao talk about case
అ‌త్యాచారం కేసు.. నిందితుడితో పాటు ఆశ్ర‌మ నిర్వాహ‌కులు అరెస్ట్
author img

By

Published : Aug 13, 2020, 7:21 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెదిరి టౌన్​షిప్​లో మారుతి బాలికల అనాధ ఆశ్రమంలో 14ఏళ్ల బాలికపై లైంగికదాడి కేసులో పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు ఈటీవీ భారత్ ప్రతినిధి రాజు నిర్వహించిన ముఖాముఖిలో వెల్లడించిన విషయాలు.

అ‌త్యాచారం కేసు.. నిందితుడితో పాటు ఆశ్ర‌మ నిర్వాహ‌కులు అరెస్ట్

1. మైనర్ బాలికపై లైంగిక దాడి ఎలా బయటకు వచ్చింది తరువాత పరిణామాలు ఏం జరిగాయి?

స: జూలై 31వ తేదీన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​లో అత్యాచారం కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతి బాలికల అనాధ ఆశ్రమంలో 14ఏళ్ల బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాత ముసుగులో వచ్చి, విజయ, జయదీప్ అనే నిర్వాహకులతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను వేణుగోపాల్ రెడ్డితో కలిసి 5వ అంతస్తుకి వెళ్ళమని నిర్వాహకులు చెప్పారు. అనంతరం శీతలపానీయంలో మత్తుమందిచ్చి ఆ బాలిక అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత అత్యాచారం చేశాడు. స్ప్రుహ వచ్చిన తరువాత ఒంటిపై బట్టలు లేకపోవడాన్ని బాలిక గమనించింది ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఈనెల 7వ తేదీన నిందితులను ముగ్గురిని రిమాండ్​కు తరలించాం

2.వేణుగోపాల్ రెడ్డి ఆశ్రమానికి ఎలా పరిచయమయ్యాడు ఒక్క అమ్మాయి పైనేనా, ఇతర అమ్మాయిలపై అఘాయిత్యాలు వడగట్టాడా?

స: ఆ ఒక్క బాలిక పైన లైంగికదాడి చేశాడు వేణుగోపాల్ రెడ్డి ఫార్మా పరిశ్రమలో టెక్నీషియన్​గా పని చేస్తూ వృద్ధులకు అనాథలకు సేవ చేసే ధోరణితో ఈ ఆశ్రమానికి పరిచయమయ్యాడు. అదే ముసుగులో ఈ ఘటన జరిగింది.

3. ఈ ఘటన ఆశ్రమ నిర్వాహకులకు తెలిసి జరిగిందా లేక వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడా ఇంకా ఎవరికైనా ఇందులో ప్రమేయం ఉందా?

స. వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఆశ్రమ నిర్వాహకులు సహకరించారని తెలిపింది. మత్తుమందిచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు అని వాంగ్మూలం ఇచ్చింది.

4. ఈ అత్యాచారం కేసులో ఏ ఏ కేసులు నమోదు చేశారు. ఎంతమందిపైన ఉన్నాయి?

స: హైదరాబాద్ భరోసా కేంద్రంలో ఫోక్సోలో వైద్యులు పరీక్షలు నిర్వహించగా బాలికపై లైంగికదాడితో పాటు భౌతిక దాడి కూడా జరిగిందని వైద్యులు తెలిపారు ఈ నివేదిక ఆధారంతో సీడబ్ల్యూసీ జీడిమెట్ల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు ఇవ్వటం వల్ల బాలిక బంధువులపై దాడి కేసు నమోదైంది. అలాగే అమీన్పూర్​లో లైంగిక దాడి కేసు పోక్సో చట్టం కింద నమోదైంది.

5. నిందితుల్ని కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేశారా ఎప్పుడు తీసుకుంటారు? నిందితుడు బాలికపై లైంగిక దాడి ఎంత కాలంగా చేస్తున్నాడు?

స: నిందితులను పోలీసు కస్టడీ తీసుకునేందుకు అనుమతి వచ్చింది. ఈరోజు గాని రేపు ఉదయం గాని కస్టడీకి తీసుకుంటాం. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం. ఏడాది క్రితం లైంగిక దాడి చేశాడని అప్పుడప్పుడు చేస్తున్నాడని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవటం వల్ల నిలోఫర్​లో చేర్చారు. 10వ తేదీన కోమాలోకి వెళ్లే 12వ తేదీన మృతి చెందింది.

7 ఇతర అమ్మాయిలపైన ఏమైనా కూడా ఇలాంటి దాడులు జరిగాయా?

స: బాలికపై వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాకపోతే నిర్వాహకులు సహకరించారని బాలిక చెప్పింది. కేసు నమోదైనప్పటి నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు బాలిక చనిపోయింది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి పరిశీలనలో పూర్తిస్థాయి వివరాలు సేకరించి నిందితులకు శిక్షపడేలా చూస్తాం. ఇప్పటికే ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ సెక్షన్​ కింద నమోదు చేశాం. దర్యాప్తులో ఇంకా అవసరమైతే వాటిలో సెక్షన్లు చేర్చుతాం.

ఇదీ చూడండి : తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.