ఈనెల 3న ఈటీవీ, ఈనాడులో ప్రచురితమైన కథనంపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు స్పందించారు. "పంటకాలం పూర్తయినా.. పూతకే పరిమితం"అనే శీర్షికతో వచ్చిన కథనంపై స్పందించిన అధికారులు కొండాపూర్ మండలం అనంతసాగర్‌లో పర్యటించారు. గ్రామంలోని రైతులతో సాగు వివరాలను అడిగి తెలుసుకొని.. పత్తి పంటను పరిశీలించారు. రైతులెవరూ అధైర్య పడొద్దని.. తమ పరిశీలన వివరాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: నిందితుల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు: సీపీ