ETV Bharat / state

MEDICAL COLLEGE: సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు ముమ్మరం! - Sangareddy Government Medical College latest news

సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల శాశ్వత నిర్మాణాల కోసం స్థలాల ఎంపిక సైతం పూర్తి చేశారు.

MEDICAL COLLEGE
MEDICAL COLLEGE
author img

By

Published : Jul 29, 2021, 7:22 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కేసీఆర్ సంగారెడ్డిలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

స్థలాలు అప్పగించాలని లేఖలు..

ఈ క్రమంలోనే సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో 35 ఎకరాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంగణంలోనే వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వైద్య కళాశాల విస్తరణకు అదనంగా స్థలాన్ని అందుబాటులో ఉంచాలన్న మంత్రి హరీశ్​రావు.. నర్సింగ్ కాలేజీ కోసం మరో స్థలాన్ని చూడాలని సూచించారు. దీంతో సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని నర్సింగ్ కళాశాల కోసం అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ, పోలీస్ శాఖ ఆధీనంలో ఉన్న ఆ స్థలాలను తమకు అప్పగించాలని రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆ శాఖలకు లేఖలు సైతం రాశారు.

పాత భవనాలు కూల్చివేసి.. కొత్త భవనాల నిర్మాణం..

ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోని నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ విభాగం భవనం తప్ప మిగిలిన అన్ని భవనాలు కూల్చివేయనున్నారు. వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా వైద్యాధికారి కార్యాలయ భవనంలో తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

జిల్లా ఆసుపత్రిని తరలించే అవకాశం..

సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్‌ కళాశాల నిర్మించడం వల్ల జిల్లా ఆసుపత్రి స్థానికంగా ఉండకపోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఆసుపత్రిని మరో చోటుకు మార్చే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లా ఆసుపత్రి తరలింపు కోసం పటాన్​చెరు, జహీరాబాద్, సదాశివపేటలను వైద్యారోగ్యశాఖ అధికారులు అంతర్గతంగా పరిశీలన చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్​కు జిల్లా ఆసుపత్రిని తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు.

త్వరలోనే శంకుస్థాపన..

ఇదిలా ఉండగా త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ సంగారెడ్డి వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వస్తుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

సంబంధిత కథనాలు..

Cm Kcr: కామారెడ్డికి మెడికల్ కాలేజీ... నాదీ పూచీ

JAGGAREDDY: 'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.