ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త బంద్ సంగారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలో బంద్ నేపథ్యంలో 120 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఉద్రిక్తతలు నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు ఎవరు కూడా విధుల్లోకి రాలేదు. బంద్ నిరసనలో పలువురు కార్మిక, రాజకీయ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా జేఏసీ ఛైర్మన్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి : నేడు రాష్ట్రవ్యాప్త బంద్