ETV Bharat / state

లాభసాటి సాగుకోసం 'ఆత్మ' కృషి చేయాలి: మాణిక్​రావు

లాభసాటి సాగుకోసం 'ఆత్మ' కమిటీ కృషి చేయాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన విజయ్‌ కుమార్‌ను సత్కరించారు. అనంతరం ఏడీఏ భిక్షపతి.. కమిటీ ఛైర్మన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

లాభసాటి సాగుకోసం ఆత్మ కృషి చేయాలి: జహీరాబాద్‌ ఎమ్మెల్యే

author img

By

Published : Jun 29, 2020, 7:49 PM IST

లాభసాటి సాగు కోసం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌గా ఎన్నికైన విజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే పూలమాల, శాలువాతో సత్కరించారు.

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ రైతులకు అన్నివిధాలా తోడ్పాటును అందించేలా ఛైర్మన్, డైరెక్టర్లు దృష్టి సారించాలని ఎమ్మెల్యే మాణిక్‌ రావు కోరారు. అనంతరం ఏడీఏ భిక్షపతి.. ఆత్మ ఛైర్మన్ విజయ్ కుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఛైర్మన్ సహా డైరెక్టర్లను శాలువా, పూలమాలలతో సత్కరించారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.