ETV Bharat / state

మామిడి ప్రియులకు గుడ్​న్యూస్... ఇచ్చట 450కి పైగా రకాల పండ్లున్నాయ్!

రుచిలో ఫల రారాజు మామిడి. అందులోనూ వందల రుచులను అందిస్తోంది సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా... 450కి పైగా రకాల మామిడి పండ్ల స్వచ్ఛమైన రుచిని.... మామిడి ప్రియులకు చేరువ చేస్తోంది.

GOOD NEWS FOR MANGO LOVERS
మామిడి ప్రియులకు గుడ్​న్యూస్
author img

By

Published : May 4, 2022, 6:43 PM IST

మామిడి ప్రియులకు గుడ్​న్యూస్... ఇచ్చట 450కి పైగా రకాల పండ్లున్నాయ్!

సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం... మామిడి ప్రియులకు అత్యంత ఇష్టమైన ప్రాంతంగా నిలుస్తోంది. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పరిశోధన కేంద్రంలో మామిడి, జామతోపాటు ఇతర రకాల పండ్లపై పరిశోధనలు నిర్వహిస్తారు. ఫల రాజు మామిడిలో వందల రకాలు ఇక్కడ సాగు చేస్తుండటంతో జాతీయ స్థాయిలో ఈ కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 477 రకాల మామిడిపండ్లు ఇక్కడ అందుబాటులో ఉండటంతో... దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఫలరాజ ప్రియులను ఆకర్షిస్తోంది.

మందు లేకుండా ఏ కెమికల్ వాడకుండా.. వినియోగ దారులకు అందిస్తున్నాం. దాదాపు 450కి పైగా రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వినియోగదారులు వస్తుంటారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇక్కడ మంచి రకాల మామిడి పండ్లు ఉన్నాయి. కాయ చెట్టుమీద పండుగా అయిన తర్వాతే తెంపి ఇస్తారు. ఎటువంటి రసాయన పదార్థాలు వాడరు.

- దుకాణదారులు

దసేరీ, కలాకండ్, లంగ్డా, హిమాయత్‌, బేనిషాన్‌, పంచదార, చెరుకు రసాల్‌, నాగిని, మంజీర.. ఇలా వందల రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడి తోటలో పండిన పండ్లను ప్రత్యేక దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తామే చెట్టు నుంచి కోసుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. ఈసారి వాతావరణ ప్రతికూల ప్రభావంతో దిగుబడి తక్కువగా ఉందని దుకాణదారులు చెబుతున్నారు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల వారు తమ వద్ద పండ్లు తీసుకెళ్తుంటారని వివరిస్తున్నారు.

మేం ఇక్కడే ఉంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడే కొంటాం. మంచిగా ఉంటాయి. నేచురల్​గా ఉంటాయి. తక్కువ రేటుకు ఇస్తున్నారు. అందుకే ఇక్కడికి వస్తాం. చాలా రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్ మాత్రం చాలా స్వీట్​గా ఉంటాయి.

- వినియోగదారులు

రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో పండ్లు మగ్గబెట్టడంతో.... అనేక మంది ఇక్కడికి మామిడిపండ్ల కోసం వస్తారు. ఫల పరిశోధన కేంద్రంలో కాసే ప్రతి పండూ ఇక్కడే అమ్ముతారు. అయా రకాన్ని బట్టి కిలో 80 రూపాయల నుంచి 2500 రూపాయల ధరల శ్రేణిలో ఇక్కడ పండ్లు లభ్యమవుతాయి. బయటితో పోలిస్తే ధర కాస్త ఎక్కువైనా నాణ్యత, రుచిలో వీటికి ఏవీ సాటిరావని వినియోగదారులు చెబుతున్నారు. ఈ సారి సీజన్ త్వరగా ముగియవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఏటా జూన్ వరకూ పండ్లు అమ్ముతామని ఈసారి మేలోనే విక్రయం ఆగిపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.