వైస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఏడో రోజు విజయవంతంగా సాగింది. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలోని ఆగర్మీయాగూడ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రలో దారి పొడవునా సమస్యలు తెలుసుకుంటూ షర్మిల ముందుకుసాగారు. పాదయాత్రలో వైస్సార్టీపీ ముఖ్య నాయకులు కొండ రాఘవ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, ఏపూరి సోమన్న, ఎడ్మ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత గ్రామం తిమ్మాపూర్‌కు చేరుకున్న షర్మిల.. ప్రతీ మంగళవారం చేపట్టే నిరుద్యోగుల నిరాహార దీక్షను అక్కడే కొనసాగించారు. నిరుద్యోగ దీక్షలో భాగంగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని.. షర్మిలకు మద్దతు తెలిపారు.
అనంతరం.. అదే గ్రామంలో రాత్రి బస చేశారు. ఎనిమిదో రోజు యాత్ర సందర్భంగా.. రేపు ఉదయం కందుకూరు మండలం తిమ్మాపూర్ నుంచి రాచులూర్, బేగంపేట, గాజులబూర్జు తండా, మాదాపూర్ మీదుగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు చేరుకోనున్నారు. రేపు రాత్రికి ఎలిమినేడులోనే షర్మిల బస చేయనున్నారు.
ఇదీ చూడండి: