ETV Bharat / state

సందడిగా సమతామూర్తి కేంద్రం.. సాయంత్రం ముచ్చింతల్​కు నితిన్ గడ్కరీ

Ramanuja Sahasrabdi Utsav: సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు పదో రోజు శోభాయమానంగా జరుగుతున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భక్తులు, సందర్శకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించుకోగా.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ రాందేవ్​ సాయంత్రం ముచ్చింతల్​కు రానున్నారు.

samatha murthy centre muchhintal
సమతామూర్తి కేంద్రం
author img

By

Published : Feb 11, 2022, 3:37 PM IST

Ramanuja Sahasrabdi Utsav: సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు పదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరావడంతో శ్రీ రామ నగరం జనసంద్రంగా మారింది. ఉత్సవాల్లో భాగంగా నేడు సమతామూర్తి సన్నిధిలో ఉన్న 108 దివ్యదేశాల్లో 36 ఆలయాల్లోని దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం దేవతామూర్తులను దివ్యదేశాలకు తీసుకొచ్చారు. చినజీయర్ స్వామి స్వయంగా దివ్యదేశాల్లో పూజలు నిర్వహించి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. మరో 21 దేవాలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్ఠాపనతో మొత్తం 108 దివ్యదేశాల దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నెల 13న ఆ 21 దేవాలయాల్లోనూ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. చినజీయర్​ స్వామి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు, విద్యాప్రాప్తికై హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. ప్రవచన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజ, కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సమతామూర్తి కేంద్రానికి బాబా రాందేవ్​

మరోవైపు రామానుజాచార్యుల విగ్రహ సందర్శన కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అతిథుల రాకతోనూ సమతామూర్తి కేంద్రం మరింత సందడిగా మారింది. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి.. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం విశేషాలను చిన జీయర్ స్వామి.. ఆయనకు వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కుటుంబసభ్యులతో కలిసి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యోగా గురు బాబా రాందేవ్ ఇవాళ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సమతామూర్తితో పాటు దివ్యదేశాలను సందర్శించనున్నారు.

జయజయ ధ్వానాలతో

మరోవైపు యతి రామానుజాచార్యుల జయజయ ధ్వానాలతో ముచ్చింతల్‌ మార్మోగుతోంది. వేద పారాయణం.. అష్టాక్షరీ మహా మంత్ర జపం.. విష్ణు సహస్ర నామ పారాయణల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని భగవన్నామస్మరణలో మునిగిపోతున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహంలో నగరం నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి సమతామూర్తిని దర్శించుకుంటున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌ స్వామికి పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. 120 కిలోల స్వర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణం చేయనున్నారు. 14న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

ఇదీ చదవండి: రామానుజాచార్యులు అసమానత్వపు గోడలు కూల్చారు: రాజ్​నాథ్​ సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.