ETV Bharat / state

'నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం' - నందిగామలో ధ్యాన కేంద్రం

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రానికి భాగ్యనగరం వేదిక కాబోతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనం​లో ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రాన్ని నేడు యోగా గురువు బాబా రాందేవ్​ ప్రారంభించనున్నారు.

worlds biggest meditation center opening by Ramdev baba in rangareddy district
'నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం'
author img

By

Published : Jan 28, 2020, 9:23 AM IST

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హలో నిర్మించిన అతిపెద్ద ధ్యాన మందిరాన్ని యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ​ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ గురూజీ కమలేష్ డి పటేల్ పాల్గొననున్నారు. పలుదేశాలకు చెందిన 40 వేల అభ్యాసీలు హాజరుకానున్నారు. హార్ట్ ఫుల్​నెస్ సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది ఒకే చోట ధ్యానం చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. హార్ట్​ ఫుల్​నెస్​ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెడిటేషన్ కేంద్రం ఐకానిక్ డిజైన్​గా నిలవనుంది.

హార్ట్ ఫుల్​నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ దాజి ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు. అడవికి దగ్గరలో పూర్తి ప్రశాంత వాతావరణం మధ్య ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. తాబేలు ఆకారంలో 8 ఉపకేంద్రాలు నిర్మించారు. విద్యుత్‌ వెలుగుల మధ్య ఈ ధ్యాన కేంద్రం కాంతులీనుతోంది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం, పచ్చిక మైదానాలతో కూడిన ఈ ధ్యాన కేంద్రంలో మెడిటేషన్​ చేస్తే... ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.

2017 డిసెంబర్ 25న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి 2న కోవింద్ ఈ కేంద్రాన్ని సందర్శించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.