సామాజిక మాధ్యమాలు, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసినా మృతురాలి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.. ఇంతకీ ఆమె ఎవరు? మృతదేహాన్ని పడేసేందుకు నిందితులు కనీసం దిగేందుకు కూడా అవకాశం లేని తంగెడపల్లి పైవంతెననే ఎందుకు ఎంచుకున్నారు? తెలిసిన వాళ్ల పనేనా..? అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో మృతి చెంది ఉంటుందని వైద్యులు అంచనా వేశారు.. మరి.. ఏ సమయంలో మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి ఉంటారు? మృతదేహంపై నూలు పోగు లేకుండా తీసేశారు. మరి.. బంగారు గాజలు, మెడలో లాకెట్, ఉంగరం తదితరాలను అలాగే ఎందుకు వదిలేశారు? అర్ధరాత్రి వేళ ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయని తెలిసే మృతదేహాన్ని ఆ వంతెన వద్దకు తెచ్చారా మృతదేహాన్ని రోడ్డుపై నుంచి పైవంతెన కిందకు దింపడం ఒక్కరితో అయ్యే పని కాదు.. ఇద్దరా.. ముగ్గురా.. ఎంత మంది ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారు?
- దిశ ఘటనలో మాదిరిగానే మృతదేహాన్ని కాల్చేయాలనుకున్నారా.. 12 కి.మీల నుంచి 13 కి.మీల దూరం వరకు పెట్రోల్ బంకులు లేకపోవడంతో ఎవరూ గుర్తు పట్టకుండా బండరాయితో తలపై మోదారా?
- ఆ మార్గంలో సీసీకెమెరాలు పనిచేయడం లేదని తెలిసే మృతదేహాన్ని అక్కడ పడేశారా..?
- మృతదేహంపై ఎలాంటి ఇతర గాయాలు, గాట్లు లేవు.. అత్యాచారం జరిగిందా.. లేదా? ఎలా చంపి ఉంటారు?
- మహిళలను చంపిన చోటు నుంచి మృతదేహాన్ని పైవంతెన వరకు ఎలా తీసుకొచ్చారు?
- మృతురాలి చర్మ రంగును బట్టి స్థానికురాలు కాకపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.. మరి ఉత్తర భారత దేశానికి చెందిన మహిళా..? ఎక్కడికి.. ఎందుకు వచ్చింది..?
- మృతురాలి చేతి మణికట్టు వద్ద గాయం ఎలా అయింది..?