ఎగువన కురుస్తోన్న వర్షానికి రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్లో 1786.175 అడుగులకు నీరు చేరింది. సాగర్లోకి 2 వేల 222 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. జలాశయం నీటిమట్టం 1789 అడుగులకు చేరితే గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు తెలిపారు.
ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున మూసీ పరివాహక వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాగా ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులుగా ఉంది.
ఇదీ చదవండి: హైదరాబాద్లోని జంట జలాశయాల్లో వరద తగ్గుముఖం