వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ హైదరాబాద్ నగర శివారు పహాడి షరీఫ్, మామిడిపల్లి ప్రాంతాల్లో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం పర్యటించారు. వారి సిబ్బందితో కలిసి ఆక్రమణకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. పహాడి షరీఫ్ దర్గా పైకి వెళ్లడానికి నిర్మాణం చేపడుతున్న ర్యాంప్ పనుల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పహాడి షరీఫ్ దర్గాకు సంబంధించి 2,121 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు తెలిపారు. అందులో చాలా భాగం కబ్జాకు గురైనట్లు గుర్తించామని సలీం వెల్లడించారు. వాటిని పరిశీలించి అక్రమ కట్టడాలను కూల్చివేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇందులో తమ డిపార్ట్మెంట్ వాళ్లు ఉన్నా కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. అలాగే మామిడిపల్లిలో 718 ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నదని... అక్కడ కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ఏప్రిల్ నుంచి జనాభా లెక్కల సర్వే