గతంలో ఉన్న ఎంపీలతో కేసీఆర్ చేసిందేమీ లేదని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గస్థాయి కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. తెరాసకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, వార్డ్ సభ్యులు కాంగ్రెస్లో చేరారు.
ఇవీ చూడండి: భారత్లో సరైన ఆహారం లేక ఇన్ని చావులా?