రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. గులాబీ దళానికే ప్రజలు పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌రెడ్డిపై 14 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రంజిత్‌రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్న పంథాలో ఈ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచే ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిణామాలు... అధికార పార్టీకి కలిసివచ్చాయి.
తెలంగాణ నినాదంతో 2014 ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేసిన తెరాస... తాజా ఎన్నికల్లోనూ కారు జోరు చూపించింది. స్వయంగా కేసీఆర్, కేటీఆర్‌లు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కేసీఆర్ చరిష్మా, సంక్షేమ పథకాలే తమని గెలిపించాయని నేతలు తెలిపారు.
తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బలమైన పట్టు వుండటంతో చివరి వరకు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అనూహ్యపరిణామాల మధ్య స్వల్ప తేడాతో గులాబీ పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి