తెరాస అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కార్మిక, శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి బహుమతి ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. పేదల కోసం ఎక్కువ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్, భాజపాలకు డిపాజిట్లు రావనిజోస్యం చెప్పారు.
ఇవీ చూడండి:గులాబీ గూటికి సండ్ర